విజిలెన్స్ సంస్థ పనితీరును మెరుగుపరిచే సాధనం

by Naga Rani Yarlagadda |

ఏ సంస్థలోనైనా సరే విజిలెన్స్ శాఖ అన్నది సంస్థ పనితీరును, ఉద్యోగుల సమర్థతను మెరుగుపరిచే సాధనంగా ఉండాలని..

విజిలెన్స్ సంస్థ పనితీరును మెరుగుపరిచే సాధనం
X
  • నిర్ణయాలు పారదర్శకంగా ఉంటే విజిలెన్స్ అవసరం ఉండదు
  • ఎన్ఎండీసీ సీఎండీ అమితాభ్ ముఖర్జీ

దిశ, తెలంగాణ బ్యూరో: ఏ సంస్థలోనైనా సరే విజిలెన్స్ శాఖ అన్నది సంస్థ పనితీరును, ఉద్యోగుల సమర్థతను మెరుగుపరిచే సాధనంగా ఉండాలని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) సీఎండీ అమితాభ్ ముఖర్జీ అన్నారు. సింగరేణి భవన్ లో శనివారం సాయంత్రం జరిగిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. పక్షపాత రహితంగా సేవలు అందించే వ్యక్తుల వల్లే సంస్థల పని సంస్కృతి మెరుగుపడుతుందని, అలాంటి సమర్ధత కలిగిన వారు పెద్ద సంఖ్యలో ఉంటే జాతి నిర్మాణం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. సమయం, పరిస్థితి, ఫలితాలను అంచనా వేసి కొన్ని సందర్భాల్లో విచక్షణతో సత్వర నిర్ణయాలు తీసుకునే నాయకత్వాలు కూడా ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమన్నారు. నిబంధనల కన్నా నైతిక విలువలు గొప్పవని అభిప్రాయపడ్డారు.

కలిసి పనిచేస్తాం..

సింగరేణి బహుముఖ విస్తరణ ప్రాజెక్టులపై సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ వివరించారు. అంతర్జాతీయంగా విస్తరించే ప్రణాళిక ఉన్న సింగరేణి.. ఎన్ఎండీసీ భవిష్యత్ ప్రాజెక్టుల్లోనూ భాగస్వామిగా ఉండటానికి సంసిద్ధంగా ఉందని తెలిపారు. దీనిపై ఎన్ఎండీసీ సీఎండీ అమితాభ్ ముఖర్జీ స్పందిస్తూ.. రానున్న రోజుల్లో బొగ్గు రంగంలో సింగరేణి సహకారాన్ని తాము తీసుకోవడానికి, అలాగే ఇతర మైనింగ్ రంగంలో సింగరేణిని భాగస్వామిగా చేసుకోవడంపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. పర్యావరణ పరిరక్షణలో సింగరేణి పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇన్ కమ్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ వింగ్ ప్రిన్సిపల్ డైరెక్టర్ రాజ్ గోపాల్ శర్మ, త్రిపుర రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సింగరేణి మాజీ డైరెక్టర్(పర్సనల్) జి.ఎస్.జి.అయ్యంగార్, సింగరేణి డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కె వెంకటేశ్వర్లు, గౌతమ్ పొట్రు, తిరుమల రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్ మెంట్ అండ్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బి వెంకన్న, జీఎం(కో ఆర్డినేషన్) టి.శ్రీనివాస్, అన్ని ఏరియాల జీఎంలు, కార్పోరేట్ జీఎంలు, వివిధ విభాగాల అధిపతులు, అధికారులు పాల్గొన్నారు.

Next Story