కరీంనగర్ పారాబాయిల్డ్ రైస్ మిల్‌లో 31వేల క్విటాల ధాన్యం పక్కదోవ

by Ajay Maddhiboyina |

విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వరుస దాడులతో అధికారులు విరుచుకుపడుతున్నారు. బుధవారం మూడు యూనిట్ల వారిగా దాడులు నిర్వహించారు. దాడుల వివరాలను విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ శిఖా గోయల్ వెల్లడించారు.

కరీంనగర్ పారాబాయిల్డ్ రైస్ మిల్‌లో 31వేల క్విటాల ధాన్యం పక్కదోవ
X

దిశ, తెలంగాణ బ్యూరో: విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వరుస దాడులతో అధికారులు విరుచుకుపడుతున్నారు. బుధవారం మూడు యూనిట్ల వారిగా దాడులు నిర్వహించారు. దాడుల వివరాలను విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ శిఖా గోయల్ వెల్లడించారు. కరీంనగర్ జిల్లాలో శంకరపట్నంలో రాజ రాజేశ్వరి పారా బాయిల్డ్ రైస్ మిల్ లో ఆకస్మిక తనిఖీలు చెపట్టినట్లు తెలిపారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ ( సీఎంఆర్) స్టాక్ చెకింగ్ చేయగా రబీ 2022-23, 2024-25 సీజన్‌లకు సంబంధించి రూ.6.73 కోట్ల విలువైన 31,234 క్వింటాళ్ల స్టాక్‌లను మిల్లర్ దారి మళ్లించినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. మిల్లర్‌పై తదుపరి చర్యల కోసం పౌరసరఫరాల శాఖకు నివేదిక పంపినట్లు తెలిపారు.

రూట్ చెక్స్

విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ హైదరాబాద్ సిటీ-2 యూనిట్ అధికారులు, రవాణా, మైనింగ్ శాఖ అధికారులతో కలిసి రాయకల్ టోల్ ప్లాజా, మహబూబ్‌నగర్ జిల్లాల జడ్చర్ల - కొడంగల్ రాష్ట్ర రహదారిపై రూట్ చెక్ నిర్వహించినట్టు డీజీ పేర్కొన్నారు. పన్ను చెల్లింపు, ఓవర్‌లోడ్ పై వాహనాలపై రవాణా అధికారులు సుమారు రూ.3.60లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు. జీఎస్టీ ఉల్లంఘనలకు గాను రూ.4లక్షల జరిమానా విధించారు. మొత్తం రూ.7.60లక్షల ఫైన్ విధించి, 12 వాహనాలను జప్తు చేసినట్లు పేర్కొన్నారు. వరంగల్ యూనిట్ ద్వారా జనగాం జిల్లాలో ఆకస్మిక రూట్ చెక్ నిర్వహించి 25వాహనాల పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వాటిపై రూ.5.50లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిధులు లేదా వనరుల దుర్వినియోగం గురించి సమాచారాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌తో పంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Next Story