- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video: కింగ్ కోఠిలో రాత్రి సమయంలో రెచ్చిపోతున్న ఆకతాయిలు! వైరల్
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కొందరు పోకిరీలు ద్విచక్ర వాహనాలపై అతివేగంగా దూసుకెళ్తూ రోడ్లపై బీభత్సం సృష్టిస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కొందరు పోకిరీలు ద్విచక్ర వాహనాలపై అతివేగంగా దూసుకెళ్తూ రోడ్లపై బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ పాదచారులను, ఇతర వాహనదారులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఫోన్లు లాక్కునే ప్రయత్నం చేస్తూ హంగామా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా, కింగ్ కోఠి ప్రాంతంలో రోడ్డు పక్కన వెళ్తున్న ఓ వ్యక్తి చేతిలోంచి ఆకతాయిలు ఫోన్ లాక్కునేందుకు యత్నించగా.. అది కింద పడి పగిలిపోయింది. ఈ తతంగాన్ని వెనుక వస్తున్న మరో వాహనదారుడు వీడియో తీయడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజలను ఇబ్బందులకు గురి చేసి పైశాచికానందం పొందుతున్న ఇలాంటి పోకిరీలను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
స్పందించిన సిటీ పోలీస్‌లు
ఈ క్రమంలోనే వైరల్ అవుతున్న వీడియోను నెటిజన్లు హైదరాబాద్ సిటీ పోలీసులకు, కమిషనర్ సజ్జనార్‌కు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ట్యాగ్ చేశారు. దీనిపై హైదరాబాద్ సిటీ పోలీసులు తక్షణమే స్పందించారు. సుల్తాన్ బజార్ ఎస్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, ఆకతాయిలు వాడిన వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు ఒకరిని అదుపులోకి తీసుకున్నామని ట్వీట్ చేశారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని ట్వీట్‌లో పేర్కొన్నారు.






