Viral Video: మహేశ్ బాబు కల్ట్ ఫ్యాన్స్.. మాటల్లో కాదు.. చేతల్లో చూపించాడు!

by Ramesh Naini |

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌, నటుడు మహేశ్‌బాబుకు ఆఫ్‌లైన్‌లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ గట్టిగానే ఫాలోయింగ్ ఉటుందని తెలిసిందే.

Viral Video: మహేశ్ బాబు కల్ట్ ఫ్యాన్స్.. మాటల్లో కాదు.. చేతల్లో చూపించాడు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌, నటుడు మహేశ్‌బాబుకు ఆఫ్‌లైన్‌లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ గట్టిగానే ఫాలోయింగ్ ఉటుందని తెలిసిందే. ఆయన సామాజిక మాధ్యమాల్లో ఏ పోస్ట్ చేసిన నిమిషాల్లో వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా మహేశ్‌బాబు అభిమాని చేసిన పనికి నెటిజన్‌లు షాక్ అయ్యారు. మహేశ్‌బాబుకు చెందిన కారు పై పీవీఎన్ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వేపై స్పీడ్ లిమిట్ దాటినందుకు ట్రాఫిక్ పోలీసులు రెండు చలాన్లు జారీ చేసినట్లు ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం సంబంధించిన వీడియోలు, స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ నేపథ్యంలో, మహేశ్‌బాబుపై తన అభిమానాన్ని వ్యక్తం చేసిన ఓ యువకుడు ఆ చలాన్లు తన ఖర్చుతోనే చెల్లించాడు. మొత్తం రూ. 2070 పెండింగ్ చలాన్లు స్వయంగా చెల్లించాడు. పీవీఎన్ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వేపై అక్టోబర్ 4, 15 వ తేదీన మరోసారి ఓవర్ స్పీడ్ వల్ల ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేశారు. ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు రావడంతో ఆ అభిమాని తట్టుకోలేక వెంటనే చలాన్లు క్లియర్ చేసినట్లు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం చలాన్లకు సంబంధింన వీడియో, రశీదు ఫోటోలు వివిధ ప్లాట్‌ఫారమ్స్‌లో వైరల్ అవుతున్నాయి. ఇదేమీ అభిమానం సామి అంటూ పలువురు నెటిజన్‌లు కామెంట్స్ చేశారు. మహేశ్ బాబు కల్ట్ ఫ్యాన్స్.. మాటల్లో కాదు.. చేతల్లో చూపించాడని కామెంట్ హైలెట్‌గా నిలిచింది. వీడియో ఇదే..

Next Story