- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెక్నాలజీ యుగం ఎఫెక్ట్.. గృహప్రవేశంలో నిజమైన ఆవు బదులు బొమ్మ ఆవు! వీడియో వైరల్
గృహప్రవేశం సందర్భంగా సాంప్రదాయం ప్రకారం గృహ ద్వారం ముందుగా ఆవును ప్రవేశపెట్టడం ఆనవాయితీగా ఉన్న విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: టెక్నాలజీ యుగంలో సాంప్రదాయాలు, ఆచారాలు కూడా ఆధునికత దిశగా పయనిస్తున్నాయి. తాజాగా గృహప్రవేశ వేడుకల్లో చోటుచేసుకున్న ఒక ఘటన దానికి నిదర్శనంగా నిలిచింది. గృహప్రవేశం సందర్భంగా సాంప్రదాయం ప్రకారం గృహ ద్వారం ముందుగా ఆవును ప్రవేశపెట్టడం ఆనవాయితీగా ఉన్న విషయం తెలిసిందే. కానీ నగరంలోని ఓ కుటుంబం మాత్రం నిజమైన ఆవు బదులుగా బొమ్మ ఆవుతో ఆ పద్ధతిని పూర్తి చేసింది. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో (Viral video) వైరల్‌గా మారాయి. టెక్నాలజీ యుగం సాంప్రదాయాలను ఎలా ప్రభావితం చేస్తోంది? అనే చర్చ నెట్టింట మొదలైంది.
వైరల్ వీడియో ప్రకారం.. పూజారి శ్లోకం చదువుతుండగా చిన్నపాటి ప్లాస్టిక్ బొమ్మ ఆవుకి పూజలు చేసి, పూల మాల వేసి ఇంట్లో నడిపించారు. వారి ఇంట్లో ఉన్న వారంతా బొమ్మ ఆవును చూసి తెగ సంబరపడిపోయారు. నిజమైన ఆవు అయితే పై అంతస్తులో ఉన్న ప్లాట్ వరకు ఎక్కలేదని, అందువల్లే బొమ్మ ఆవుకి పూజ చేసి ఇంట్లో నడిపించారని వీడియో వైరల్ అవుతుంది. ఇది చూసిన కొంత మంది నెటిజన్లు షాక్ అయి.. రకరకాలుగా స్పందించారు.
‘సౌకర్యం దృష్ట్యా చక్కటి ఆలోచన’ అని కొందరు నెటిజన్లు ప్రశంసించారు. మరికొందరు ‘సాంప్రదాయాల విలువ తగ్గిపోతోందని’ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఈ వీడియో చూసిన పండితులు, స్వామీజీలు మాత్రం ఇలాంటి మార్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆచారాల సారాంశం కేవలం పద్ధతుల్లో కాదు, భక్తి భావంలో ఉంటుంది. కానీ సౌకర్యం పేరుతో సాంప్రదాయాలను పూర్తిగా రూపాంతరం చేయడం ఆందోళనకరం.. అని వారు వ్యాఖ్యానించారు. వైరల్ వీడియో కోసం క్లిక్ చేయండి..






