- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయం అనేది క్రమశిక్షణ మార్గదర్శకతతో వస్తుంది: పుల్లెల గోపీచంద్
ఏ రంగంలోనైనా విజయం అనేది క్రమశిక్షణ,మార్గదర్శకతతో వస్తుందని పద్మ భూషణ్ అవార్డు గ్రహీత, భారత బ్యాడ్మింటన్ జట్టు ప్రధాన జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు.

దిశ, రాంనగర్ : ఏ రంగంలోనైనా విజయం అనేది క్రమశిక్షణ,మార్గదర్శకతతో వస్తుందని పద్మ భూషణ్ అవార్డు గ్రహీత, భారత బ్యాడ్మింటన్ జట్టు ప్రధాన జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. హైదరాబాద్, అశోక్ నగర్ లో సోమవారం ఏ ఆర్ కె రిఫ్లెక్షన్స్ సివిల్ సర్వీసెస్ నూతన కోచింగ్ సెంటర్ ను పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వందమంది ఐఏఎస్, ఐపీఎస్ లనుచేయడమే లక్ష్యంగా ఏ ఆర్ కే సంస్థ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంస్థ జి.రామ్ రెడ్డి సంకల్పంతో పాటుగా, పేద విద్యార్థులకు కూడా ఉచిత కోచింగ్ ఇచ్చే విధంగా ముందడుగు వేసి ప్రోత్సహించడం అభినందనీయమని ప్రశంసించారు.
ఇలాంటి అవకాశాల ద్వారా యువత సమగ్రతతో దేశానికి సేవచేయడానికి తోడ్పడుతుందన్నారు. అదేవిధంగా విద్య నైపుణ్యం ద్వారా ఆశావహుకులకు మెరుగైన శిక్షణ అందించే విధంగా సంస్థ ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందన్నారు. క్రీడలు, పౌర సేవలు అన్ని రంగాల్లో విజయం సాధించే దిశగా యువత ఎదగాలనిఆకాంక్షిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ కె గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి రామ్ రెడ్డి, ఏ ఆర్ కె రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ డైరెక్టర్ డాక్టర్ వివేకానంద, మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.






