సర్పంచ్ ఎన్నికలు.. 3 ఓట్ల తేడాతో విజయం

by Muthe.Rajitha |

రాష్ట్రంలో చివరి విడత సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

సర్పంచ్ ఎన్నికలు.. 3 ఓట్ల తేడాతో విజయం
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో చివరి విడత సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ఓట్ల లెక్కింపులో తీవ్ర ఉత్కంఠ ఫలితాలు నమోదవుతున్నాయి. స్వల్ప మెజారిటీతో అభ్యర్థులు విజయం నమోదు చేసుకుంటున్నారు. భద్రాద్రి జిల్లాలోని గాంధీ నగర్ లో కాంగ్రెస్ బలపరచిన బానోతు మంగీలాల్ 3 ఓట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ మండలం నాగారంలో కాంగ్రెస్ మద్దతుదారు దౌల్తాపూర్ గీత 7 ఓట్ల తేడాతో గెలిచారు. ఇక కామారెడ్డి జిల్లా జగన్నాథపల్లిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి వెంకయ్య 8 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇంకా లెక్కింపు కొనసాగుతోంది.

Next Story