- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: అన్నీ తెలిసిన మీరు కూడా విమర్శించడం కరెక్ట్ కాదు.. నందిని సిధారెడ్డిపై చిన్నారెడ్డి సీరియస్
తెలంగాణ తల్లి(Telangana Thalli) విగ్రహంపై ప్రముఖ రచయిత, కవి, అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి నందిని సిధారెడ్డి(Nandini Sidda Reddy) దిగజారి మాట్లాడడం ఆయన స్థాయికి తగదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి(Chinna Reddy) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ తల్లి(Telangana Thalli) విగ్రహంపై ప్రముఖ రచయిత, కవి, అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి నందిని సిధారెడ్డి(Nandini Sidda Reddy) దిగజారి మాట్లాడడం ఆయన స్థాయికి తగదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి(Chinna Reddy) అన్నారు. సోమవారం సచివాలయం ఇండియా సెంటర్‌లో చిన్నారెడ్డి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ తల్లి విగ్రహంపై రాద్ధాంతం చేయడం నందిని సిధారెడ్డికి తగదని, ఆరోపణలను సిధారెడ్డి వెంటనే ఉపసంహరించుకోవాలని చిన్నారెడ్డి(Chinna Reddy) సూచించారు.
దేవతలు, ప్రజలకు ప్రతిరూపం తెలంగాణ తల్లి విగ్రహం అని, అంత గొప్ప విగ్రహాన్ని విపక్షాలు వంకలు తీయడం శోచనీయమని చిన్నారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ దేవత విగ్రహాన్ని గమనించినా భుజం కింది నుంచి చేతితో ఆశీర్వదిస్తున్నట్టుగానే ఉంటాయని, తెలంగాణ తల్లి విగ్రహం కూడా అలాగే ఉందని చిన్నారెడ్డి పేర్కొన్నారు. అందుకు దేవతల విగ్రహాలను ఆయన చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం(Congress Govt) అధికారికంగా ప్రకటించిన తెలంగాణ తల్లి(Telangana Thalli) విగ్రహాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాలలో ప్రతిష్టించనున్నట్లు తెలిపారు.






