- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG News : భర్తల హత్యలపై వీహెచ్ షాకింగ్ కామెంట్స్
ఇటు తెలుగు రాష్ట్రాల్లో, అటు దేశంలోనూ భర్తల వరుస హత్యలు(Husband's Murders) తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : ఇటు తెలుగు రాష్ట్రాల్లో, అటు దేశంలోనూ భర్తల వరుస హత్యలు(Husband's Murders) తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వరుస ఘటనలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు(V. Hanumantha Rao) షాకింగ్ కామెంట్స్ చేశారు. వివాహితులు అక్రమ సంబంధాలు కలిగి ఉండటం, వారి కుటుంబానికి చేటు అన్నారు. సతీ సావిత్రి తన భర్త సత్యవాణుడి ప్రాణాల కోసం ఏకంగా యముడితోనే కొట్లాడి భర్త ప్రాణాలు తిరగి దక్కించుకుందని తెలిపిన వీహెచ్.. ఇప్పుడు భార్యలే భర్తల ప్రాణాలను తీసుకున్నారని మండిపడ్డారు.
భర్తలను చంపడానికి భార్యలే స్కెచ్ వేయడం అత్యంత దురదృష్టకరం అని అన్నారు. ఇలాంటి హత్యలు తానెప్పుడూ చూడలేదని, భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడే వారి సంసారం, జీవితాలు బాగుంటాయని తెలిపారు. తల్లులే పిల్లలకు తండ్రి లేకుండా చేసే దౌర్భాగ్యపు కాలం దాపురించిదని ఆవేదన వ్యక్తం చేశారు. యువత లవ్ ఎఫైర్స్ పెట్టుకొని కన్నవాళ్లను చంపడం దారుణం అని, అంతగా ఇష్టపడితే కొట్లాడి, ఒప్పించి పెళ్లిచేసుకోవాలని హితవు పలికారు.






