- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పండగల సమయంలో ఎన్నికల ట్రైనింగా?.. ఎన్నికల సంఘం నిర్ణయంపై వీహెచ్‍పీ ఆగ్రహం
ఎన్నికల సంఘం, ప్రభుత్వం నిర్ణయంపై విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం సిబ్బందికి ట్రైనింగ్‍పై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో దసరా పండగల సమయంలో టీచర్లకు ఎన్నికల ట్రైనింగ్ (Teachers Training) నిర్వహించాలన్న ఈసీ నిర్ణయంపై విశ్వహిందూపరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర అధికారిక పండగ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్న శుభసందర్భంగా వాటన్నిటిని రద్దు చేసుకొని ట్రైనింగ్‍కు రావాలని ఆదేశాలు జారీ చేయడం తగదని విశ్వహిందూ పరిషత్ (VHP) తెలంగాణ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి (Pagudakula Balaswamy) ఎలక్షన్ కమిషన్ తీరును తప్పుపట్టారు. ఇది హిందూ వ్యతిరేక చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన వీడియో రిలీజ్ చేశారు.
ఎన్నికలు నిర్వహించుకోవాల్సిందేనని అభిప్రాయపడిన బాలస్వామి ట్రైనింగ్ పండగ తర్వాత నిర్వహిస్తే సరిపోతుంది కదా అన్నారు. ఇప్పటికే ఉద్యోగులు, మహిళలు అందరూ కూడా సెలవుల రీత్యా తమ తమ స్వగ్రామాలకు వెళ్లారని అన్నారు. ఇటువంటి సమయంలో ఇప్పటికిప్పుడు పండుగలు, బతుకమ్మ సంబరాలు వాయిదా వేసుకుని ట్రైనింగ్‍కు రావాలని ఎలక్షన్ కమిషన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం ఏమాత్రం సరికాదని విమర్శించారు. వెంటనే ట్రైనింగ్ క్యాంపును మరో రోజుకు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. భక్తిశ్రద్ధలతో బతుకమ్మలు ఆడుతూ గౌరమ్మను పూజించే శుభదినం సందర్భంలో పండగ పవిత్రతను దెబ్బతీసే కుట్ర చేయడం సరికాదని పేర్కొన్నారు.






