- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ హైదరాబాద్‌లో విహెచ్‌పి భారీ ఆందోళన
బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హైదరాబాద్‌లోని కొత్తపేటలో విశ్వహిందూ పరిషత్ ఇతర అనుబంధ హిందూ సంఘాలు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి.

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హైదరాబాద్‌లోని కొత్తపేటలో విశ్వహిందూ పరిషత్ (Vishwa Hindu Parishad) ఇతర అనుబంధ హిందూ సంఘాలు భారీ నిరసన కార్యక్రమాన్ని (Protest event) చేపట్టాయి. ఈ సందర్భంగా విహెచ్‌పి జాతీయ ప్రతినిధి శశిధర్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో హిందువులపై అమానుష దాడులు జరుగుతున్నాయని, వారి రక్షణ కోసం భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పొరుగు దేశంలో హిందూ సమాజం (Hindu society) ఎదుర్కొంటున్న వేధింపుల పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, భాగ్యనగర్‌లో పెద్ద సంఖ్యలో బంగ్లాదేశ్ (Bangladesh) చొరబాటుదారులు. రోహింగ్యాలు నివసిస్తున్నారని ఆయన ఆరోపించారు. వీరి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోతే, విశ్వహిందూ పరిషత్ తన తదుపరి కార్యాచరణను ప్రకటిస్తుందని శశిధర్ హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమం వల్ల ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొనగా, హిందూ సంఘాల నేతలు బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.






