AI సమ్మిట్‌లో అపోజిషన్ లీడర్‌కి అవకాశం ఇవ్వలేదు.. ఢిల్లీ సదస్సుపై వీహెచ్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2026-02-22 10:42:26  IST  )

ఢిల్లీలో జరిగిన AI సమ్మిట్‌లో అపోజిషన్ లీడర్ కి అవకాశం ఇవ్వలేదని మాజీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు.

AI సమ్మిట్‌లో అపోజిషన్ లీడర్‌కి అవకాశం ఇవ్వలేదు.. ఢిల్లీ సదస్సుపై వీహెచ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలో జరిగిన AI సమ్మిట్‌లో అపోజిషన్ లీడర్ కి అవకాశం ఇవ్వలేదని మాజీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో ఆయన ఢిల్లీలో జరిగిన ఏఐ సదుస్సుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ప్రకారం పవర్‌లో ఉన్నవారికి , అపోజిషన్ లీడర్ కి సమాన హోదా ఉంటుందని అన్నారు. ఇప్పుడు బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. బీజేపీ వైఖరిని ప్రజలు ఇప్పుడు కాకున్న రేపు ఐన తిరస్కరిస్తారని వెల్లడించారు. ఇందిరా గాంధీ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసిన నాయకుడు రాజీవ్ గాంధీ అని, పంచాయతీరాజ్ ఎన్నికల్లో మహిళలకు అవకాశం ఇచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని కొనియాడారు. తెలంగాణలో దేశానికే ఆదర్శంగా నిలిచేలా కుల గణన జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ పై అన్ని విధాలా కృషి చేశారని ఆయన తెలిపారు. తెలంగాణలో చైర్మన్, మేయర్, ఉప సర్పంచ్ అంటూ మహిళలకి రిజర్వేషన్ కల్పించామని వెల్లడించారు. రాజీవ్ గాంధీ ఆలోచనలని రేవంత్ రెడ్డి ముందుకు తీసుకొని పోతున్నారని చెప్పారు. డీసీసీల ట్రేడింగ్‌లో పని చేసే వాళ్ళకి పదవులు అని సీఎం చెప్పడం అభినందనీయం అని అన్నారు.

బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది.. కాంగ్రెస్ నేత వీహెచ్ తీవ్ర ఆరోపణలు

Next Story