తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రేపే తీర్పు

by Gantepaka Srikanth |

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు రేపు(బుధవారం) తుది తీర్పు వెల్లడించనున్నది.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రేపే తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు రేపు(బుధవారం) తుది తీర్పు వెల్లడించనున్నది. కాగా, 2024 జనవరి 31వ తేదీతో తెలంగాణలో సర్పంచుల పదవీకాలం ముగిసినా ఎన్నికలు జరపడం లేదని నల్గొండ, నిర్మల్, జనగాం, కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఆరుగురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సోమవారమే హైకోర్టు విచారణ చేపట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏడాదిన్నర కాలంగా ఏం చేస్తున్నారని అడిగింది. గత డిసెంబర్‌లో రెండు నెలల్లోగా ఎలక్షన్స్ నిర్వహిస్తామని చెప్పి.. ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ బుధవారానికి వాయిదా వేసింది. అయితే.. విచారణ అనంతరం బుధవారమే తుది తీర్పు ఉండటంతో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు.. రాష్ట్రంలోని 566 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు పంచాయతీ రాజ్ శాఖ తుది జాబితా ఖరారు చేసింది. 2019లో 32 జిల్లా పరిషత్​చైర్మన్లు, 539 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ సారి 31 జిల్లా పరిషత్,​566 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎలక్షన్స్ జరగనున్నాయి.

Next Story