- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Venu Swamy : హైకోర్టులో వేణు స్వామి vs మహిళా కమిషన్ పంచాయితీ
వివాదాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది.

X
దిశ, వెబ్ డెస్క్ : వివాదాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. ఇటీవల వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కు ఫిర్యాదులు అందాయి. వాటి ఆధారంగా మహిళా కమిషన్ వేణుస్వామిని విచారణకు రమ్మని ఆదేశాలు జారీ చేసింది. అయితే మహిళా కమిషన్ పంపిన ఈ నోటీసులను సవాలు చేస్తూ వేణుస్వామి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్ పై విచారించిన కోర్ట్.. వేణుస్వామికి నోటీసులు ఇవ్వడానికి గల కారణాలు, అర్హత ఏంటని కమిషన్ ను ప్రశ్నించింది. మహిళా కమిషన్ తరపున వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్.. వేణుస్వామి జ్యోతిష్యాల పేరుతో అసత్య ప్రచారాలు, మోసపూరిత ప్రకటనలు చేస్తూ.. ప్రజలను మభ్యపెడుతున్నాడని, మోసం చేస్తున్నాడని కోర్టుకు తెలిపారు. దీనిపై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్ట్.
Next Story






