Venu Swamy: మహిళా కమిషన్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పిన వేణు స్వామి

by Ramesh Naini |

ప్రముఖ వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి (Venu Swamy Parankusham) తెలంగాణ ఉమెన్ కమిషన్‌కు బహిరంగంగా క్షమాపణ చెప్పారు.

Venu Swamy: మహిళా కమిషన్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పిన వేణు స్వామి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి (Venu Swamy Parankusham) తెలంగాణ ఉమెన్ కమిషన్‌కు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. హీరో నాగచైతన్యపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వేణుస్వామి క్షమాపణలు కోరారు. కొన్ని రోజుల క్రితం అక్కినేని నాగ చైతన్య (Nagachaitanya), శోభిత ధూళిపాల (Shobitha Dhulipalla) వివాహం సందర్భంగా ఓ చానల్‌లో ఈ ఇద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండరు అని, విడాకులు తీసుకుంటారని వేణు స్వామి జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. అప్పటి ఆ వ్యాఖ్యలపై తెలుగు ఫిలిమ్ జర్నలిస్టుల యూనియన్ సభ్యులు (Telangana Women's Commission) తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదని కలిసి వేణు పై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఉమెన్ కమిషన్ ఆయనకు నోటీసులు ఇచ్చింది.

కమిషన్ నోటీసులను సవాల్ చేస్తూ వేణు స్వామి హైకోర్టుకు వెళ్లారు. అయితే, హైకోర్టు సైతం ఉమెన్ కమిషన్ ఎదుట హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే మంగళవారం కమిషన్ ముందు హాజరయ్యారు. హీరో నాగ చైతన్య, శోభిత వైవాహిక జీవితంపై తను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు కమిషన్ ముందు తెలియజేశారు. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కావొద్దని వేణు స్వామిని ఉమెన్ కమిషన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. కాగా, అనేకమంది ప్రముఖులు, ఫిలిం సెలబ్రిటీస్‌పై వేణు స్వామి జాతకాలు చెప్పడం కాంట్రవర్సీలకు దారితీస్తుంటాయి.

Next Story