Venkaiah Naidu: ఫ్రీ బస్సు ఇవ్వమని అడిగారా?.. తెలుగు రాష్ట్రాల్లో ఉచితాలపై వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-11-27 11:33:45  IST  )

ఉచిత పథకాల విషయంలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఆలోచన చేయాలని వెంకయ్య నాయుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Venkaiah Naidu: ఫ్రీ బస్సు ఇవ్వమని అడిగారా?.. తెలుగు రాష్ట్రాల్లో ఉచితాలపై వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉచిత పథకాలను ఉద్దేశించి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్రీ బస్సు ఇవ్వండి (RTC Free Bus Scheme) మేము తిరుగుతాం అని మహిళలు అడిగారా?ప్రభుత్వాలు ఎందుకు ఉచిత పథకాలు తీసుకువస్తోందని ప్రశ్నించారు. సంపద సృష్టించే మార్గం చూడాలి కానీ అప్పులు తెచ్చి ఉచితాలు ఇవ్వడం సరికాదని తెలంగాణ(Telangana), ఏపీ (Andhra Pradesh) ప్రభుత్వాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆధ్రప్రదేశ్‍లోని గుంటూరు తెనాలిలో నిర్వహించిన సేవా జ్యోతి పురస్కార ప్రదాన కార్యక్రమానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏది కూడా ఉచితంగా ఇవ్వకూడదనేది నా అభిప్రాయం అన్నారు. ఉచిత పథకాలు ఇస్తుంటే నాకేం నష్టం కాదు. కానీ ఉదయం ఉచిత పథకాలు ఇచ్చి సాయంత్రం మద్యం రూపంలో ప్రభుత్వాలు మళ్లీ ప్రజల వద్ద నుంచి డబ్బులు వెనక్కీ రాబట్టుకుంటున్నాయన్నారు. ఇది నవ్వులాట కాదని భయంకరమైన సత్యం అన్నారు. పేదలకు విద్యా, వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలని మిగతవేవి కూడా ఉచితం ఉండకూడదన్నారు. ఉచితాలు ఏమాత్రం మంచివి కాదని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఈ విషయాన్ని ఆలోచించాలన్నారు. వీడియో

Next Story