యోగాకు మ‌తాన్ని ఆపాదించ‌వ‌ద్దు: వెంక‌య్య‌నాయుడు

by Ajay Maddhiboyina |

యోగా డే (YOGA DAY) సంద‌ర్భంగా నేడు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులతో పాటు భారీగా ప్రజలు తరలివచ్చారు.

యోగాకు మ‌తాన్ని ఆపాదించ‌వ‌ద్దు: వెంక‌య్య‌నాయుడు
X

దిశ‌, వెబ్ డెస్క్: యోగా డే (YOGA DAY) సంద‌ర్భంగా నేడు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులతో పాటు భారీగా ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (VENKAIAH NAIDU) మాట్లాడుతూ... ప్రపంచ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే మన లక్ష్యం అని చెప్పారు. యోగా అంతిమ లక్ష్యం మానవత్వం సాధించడం అని అన్నారు. యోగాకు మ‌తం లేద‌ని, కొంత‌మంది దానికి మ‌తం ఆపాదించాల‌ని చూస్తున్నార‌ని అన్నారు. యోగా అనేది మ‌న జీవ‌న విధానం అని చెప్పారు. మ‌న పూర్వీకుల నుండి ఇది వ‌చ్చింద‌ని, మ‌న పిల్ల‌కు కూడా దీనిని అందించాల‌ని సూచించారు.

యోగా విష‌యంలో రాజ‌కీయాలు కూడా చేయ‌వ‌ద్ద‌ని కోరారు. ఆది యోగి పతంజలి మహర్షి సూత్రాలు సర్వకాలలకు ఆచరణీయం అని చెప్పారు. యోగా అంటే మనస్సు, వృత్తి, ప్ర‌వృత్తుల‌ను నిగ్ర‌హించ‌డ‌మే అని ఇది చాలా ముఖ్య‌మ‌ని తెలిపారు. మాన‌సికంగా, శారీర‌కంగా అన‌వ‌స‌ర‌మైన‌వి వ‌దిలిపెట్టాల‌ని అన్నారు. మ‌న దేశంపై విదేశాలు చేసిన దాడుల నుండి తేరుకుని అభివృద్ధి పథంలో ముందుకు వెళుతున్నామ‌ని చెప్పారు. ఆప‌రేష‌న్ సిందూర్ అంటే ప్ర‌పంచమంతా విస్తురుపోతుంద‌ని అన్నారు. ఉగ్ర‌వాద స్థావ‌రాల‌ను ప‌క్క‌వాళ్ల‌కు ఎలాంటి హాని క‌లిగించ‌కుండా పేల్చివేశార‌న్నారు. మ‌న‌కు అలాంటి టెక్నాల‌జీ అందించిన శాస్త్ర‌వేత్త‌ల‌తో పాటూ పోరాడిన యోధుల‌ను గుర్తుంచుకోవాల‌న్నారు.

Next Story