- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేతగాకపోతే CM రేవంత్‌తో కలిసి పనిచెయ్.. బండి సంజయ్‌పై ప్రభుత్వ విప్ ఫైర్
నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ వేముల వీరేశం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దిశ, వెబ్‌డెస్క్: నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ వేముల వీరేశం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, బీజేపీ నాయకుల తీరును ఎండగట్టారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, దీన్ని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా వ్యతిరేకిస్తున్నారని వీరేశం పేర్కొన్నారు. "దక్షిణాది నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్, ఇక్కడి రాష్ట్రాలకు నష్టం జరగనివ్వనని చెప్పాల్సింది పోయి.. సీఎంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు" అని విమర్శించారు.
న్యాయం జరిగేలా పని చేయాలి..
ఈ దేశం పట్ల భక్తి కేవలం బండి సంజయ్‌కు ఒక్కరికే ఉన్నట్లుగా ఆయన ప్రవర్తన ఉందని ఎద్దేవా చేశారు. త్యాగాల చరిత్ర కాంగ్రెస్‌ది అని గుర్తుచేశారు. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసిందని వీరేశం తెలియజేశారు. "గాంధీ కుటుంబం ఈ దేశ సమగ్రత కోసం రక్తాన్ని ధారపోసింది. అలాంటి గొప్ప చరిత్ర ఉన్న పార్టీ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడుతుంటే బీజేపీ నేతలు భయపడుతున్నారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన బండి సంజయ్, ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరిగేలా పని చేయాలని వేముల వీరేశం సూచించారు. "బండి సంజయ్‌కు ఒకవేళ పని చేయడం చేతకాకపోతే, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేయాలి. అంతే తప్ప వాస్తవాలు మాట్లాడుతున్న మా ముఖ్యమంత్రిపై అవాకులు చెవాకులు మాట్లాడటం మానుకోవాలి" అని హెచ్చరించారు.






