- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగదీష్ రెడ్డికి వేముల వీరేశం సవాల్
బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డికి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం నేడు సంచలన సవాల్ విసిరారు.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డికి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం నేడు సంచలన సవాల్ విసిరారు. సూర్యాపేట నియోజకవర్గంలో జగదీశ్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే, తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని వీరేశం ఛాలెంజ్ చేసారు. 'వచ్చే ఎన్నికల వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు, రేపే రాజీనామా చేసి జగదీశ్ రెడ్డి పోటీ చేయాలి' అని డిమాండ్ చేసారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జగదీశ్ రెడ్డి చేస్తున్న విమర్శలను ఉద్దేశిస్తూ... 'సీఎం రేవంత్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది' అని హెచ్చరించారు.
కాగా నిన్న తిరుమలగిరి సభలో సీఎం రేవంత్ రెడ్డి జగదీష్ రెడ్డిని కామెంట్ చేయగా.. ప్రతిగా నేడు జగదీష్ రెడ్డి రేవంత్‌రెడ్డి తెలంగాణకు చేసింది ఏమీ లేదని అన్నారు. లేని గొప్పలు చెప్పుకోవడం ఆయనకు అలవాటేనని విమర్శించారు. నానాటికీ ఆయన తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అసత్యాలతో సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడని చెప్పారు.






