- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్ధానిక ఎన్నికల్లో లబ్దిపొందేందుకు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర: మాజీ మంత్రి వేముల
స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పుకుని ఓట్లు అడిగే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కి లేదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పుకుని ఓట్లు అడిగే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కి లేదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. మీనాక్షి నటరాజన్ ముందు పెట్టి పాదయాత్ర పేరుతో ప్రజలను రెండవ సారి మోసం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి అడ్డగోలు హామీలు ప్రజలు నమ్మడం లేదన్నారు. డిక్లరేషన్ ల పేరిట ఢిల్లీ నుండి రోజుకో నాయకుని రప్పించి వారితో హామీలు ఇప్పించి ప్రజలను మొదటిసారి నమ్మించి మోసం చేశారని గుర్తు చేశారు. నిజమాబాద్ జిల్లాలో సుమారు 2 లక్షల 3 వేల రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా కేవలం 1 లక్ష 3 వేల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యింది.మిగతా లక్ష రైతులకు కాలేదన్నారు.
జిల్లాలో ఇంకా లక్ష మంది రైతులకు 2 లక్షల ఋణామాఫీ అంటే సుమారు 2వేల కోట్లు రేవంత్ప్రభుత్వం బాకీ ఉందన్నారు. వరంగల్ డిక్లరేషన్ లో రేవంత్ రెడ్డి ప్రతి ఎకరానికి సంవత్సరానికి 15వేలు రైతు భరోసా వేస్తామని చెప్పి ఒక సీజన్ లో కేసీఆర్ డబ్బులు 5వేలు చొప్పున వేసి అందులో రూ.2500 ఎగ్గొట్టడంతో పాటు రెండో సీజన్ లో పూర్తిగా ఎగనామం పెట్లారని మండిపడ్డారు. పసుపుకు క్వింటాలుకు రూ. 12వేలు ఇస్తామని మాట ఇచ్చిన 9వేల కంటే ఎక్కువ రైతు కు ధర రాలేదన్నారు. రుణమాఫీ,రైతు భరోసా,బోనస్, పసుపు రైతులకు కలిపి కేవలం నిజమాబాద్ జిల్లా రైతులకే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4500 కోట్లు అప్పుగా ఉందన్నారు. వీటిపై మీనాక్షి నటరాజన్ తన పాదయాత్రలో నిజమాబాద్ జిల్లా రైతులకు సమాధానం చెప్పాలని నిలదీశారు. ఆపార్టీ ఇచ్చిన హామీలు అన్ని సక్రమంగా అమలు చేసి ఉంటే ఈ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులు ఎందుకు అన్నారు. ప్రజా పాలన అంటూనే రేవంత్ రెడ్డి ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీ పాలన కొనసాగిస్తున్నారు. ఒక పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తే ఇంకో రాజకీయ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం చేతగాని తనమన్నారు.






