ఇకపై మొబైల్ స్క్వాడ్స్ తో వాహన తనిఖీలు.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

by Naga Rani Yarlagadda |

రవాణా శాఖలో అవినీతి నిర్మూలన, పారదర్శక సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది.

ఇకపై మొబైల్ స్క్వాడ్స్ తో వాహన తనిఖీలు.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రవాణా శాఖలో అవినీతి నిర్మూలన, పారదర్శక సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని రవాణా శాఖకు చెందిన అన్ని చెక్ పోస్టులను శాశ్వతంగా రద్దు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వాహన తనిఖీలు, పన్నుల వసూలు కోసం ఏఎన్‌పీఆర్ (ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్) కెమెరాలు, ఇతర అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా అక్రమ రవాణాను అరికట్టడానికి రవాణా శాఖ అధికారులు మొబైల్ స్క్వాడ్‌ల ద్వారా తనిఖీలు నిర్వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మొబైల్ స్క్వాడ్‌లు వాహనాలను జిల్లా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనుమతితో తనిఖీ చేస్తాయని వివరించారు. రవాణా ఫీజులు, పన్నుల చెల్లింపునకు వాహనదాహరులకు ఆన్ లైన్ సౌకర్యం ఉంటుందని వెల్లడించారు. చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై ఆన్‌లైన్‌లో జరిమానాలు విధిస్తారని వివరించారు. ఈ మార్పులన్నీ రాష్ట్ర రవాణా శాఖలో అవినీతిని తగ్గించి, పారదర్శకతను పెంచుతాయని ప్రభుత్వం తెలిపింది.

Next Story