వీర రాఘవరెడ్డిపై 30 మంది దాడి..!

by velandi.Saikiran |

చిలుకూరు బాలాజీ ఆలయ ( Chilkur Balaji Temple ) పూజారి రంగరాజన్ పై ( Ranga Rajan) దాడి కేసులో ప్రధాన నిందితుడిగా

వీర రాఘవరెడ్డిపై 30 మంది దాడి..!
X

దిశ, వెబ్ డెస్క్: చిలుకూరు బాలాజీ ఆలయ ( Chilkur Balaji Temple ) పూజారి రంగరాజన్ పై ( Ranga Rajan) దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వీర రాఘవరెడ్డిపై ( Veera raghavareddy) దాడి జరిగిందని సమాచారం అందుతోంది. మొయినాబాద్ పీఎస్ కు ( Moinabad PS) సంతకం చేయడానికి వెళ్లిన తనపై దాడి చేసినట్లు ఓ వీడియో ద్వారా వీర రాఘవరెడ్డి పేర్కొన్నారు. దాదాపు 20 నుంచి 30 మంది తనపై దాడి చేసినట్లు చెబుతున్నారు వీర రాఘవరెడ్డి.

చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వీర రాఘవరెడ్డిని టార్గెట్ చేసి కొట్టినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న వీర రాఘవరెడ్డి... ఇండియా, పాకిస్థాన్ ఇష్యూపై కూడా రియాక్ట్ అయ్యారు. ఇది జరిగిన రెండు రోజులకే వీర రాఘవరెడ్డిపై దాడి జరిగిందని సమాచారం అందుతోంది. మరి ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా, చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ పై గత 4 నెలల కిందట వీర రాఘవరెడ్డి గ్యాంగ్ దాడి చేసిన సంగతి తెలిసిందే.

Next Story