ఆఖరి రోజున ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సజ్జనార్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-09-30 15:11:56  IST  )

తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)ఎండీగా వీసీ సజ్జనార్ ఐపీఎస్ (VC Sajjanar IPS) ఆఖరిరోజున ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.

ఆఖరి రోజున ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సజ్జనార్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)ఎండీగా వీసీ సజ్జనార్ ఐపీఎస్ (VC Sajjanar IPS) ఆఖరిరోజున ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 23 మంది ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఆ లిస్టులో ప్రస్తుతం సీపీగా ఉన్న సీవీ ఆనంద్ కు హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించిన ప్రభుత్వం.. ఆయన స్థానంలో నగర సీపీగా వీసీ సజ్జనార్ ను అపాయింట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో ఆర్టీసీ ఎండీగా చివరిరోజున సజ్జనార్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రజా రవణాపై తనకు ఉన్న అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ.. సాధారణ ప్రయాణికుడిలా లక్డీకాపూల్ - టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి బస్ భవన్ వరకూ 113I/M రూట్ బస్సులో ప్రయాణించారు. కండక్టర్ కు యూపీఐ పేమెంట్ చేసి టికెట్ తీసుకున్నారు. అనంతరం ఆర్టీసీ బస్సు సేవలపై ప్రయాణికులతో ముచ్చటించారు. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలు పొందుతున్న లబ్ధిని అడిగి తెలుసుకున్నారు.

Next Story