రీల్స్ పిచ్చి పట్టిన మానసిక రోగులకు దూరంగా ఉండండి: వీసీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |   (  Updated:2025-04-27 11:30:56  IST  )

సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం కొంత మంది వింత పోకడలు పోతుంటారు.

రీల్స్ పిచ్చి పట్టిన మానసిక రోగులకు దూరంగా ఉండండి: వీసీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Social media) సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం కొంత మంది వింత పోకడలు పోతుంటారు. పబ్లిక్‌ న్యూసెన్స్ క్రియేట్ చేయడం, తమ ప్రాణాలనే కాకుండా ఇరుల ప్రాణాల మీదకు తేవడం, అసభ్యంగా ప్రవర్తించడం, డ్రగ్స్, గంజాయి, గన్ కల్చర్, జుగుప్సాకరమైన పనులు చేయడం, న్యూడిటీ, ఫేక్ సమాచారం, ప్రమాదకరమైన బైక్ స్టంట్స్ లాంటి పలు రకాల వీడియోలు కొంత మంది లైకులు, వైరల్, పాపులర్ అవ్వడం కోసం చేస్తున్నారు. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లతో ఫేమస్ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్ల నిర్వాకం అందరికీ తెలిసిందే. ఈ మధ్య ఇలాంటివి సోషల్ మీడియాలో మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ, వీసీ సజ్జనార్ (VC Sajjanar) ఆసక్తికర ట్వీట్ చేశారు. ఫస్ట్ టైమ్ గంజాయి తాగితే ఎలా ఉంటుందని ఇద్దరు యువకులు రీల్స్ వీడియో క్రియేట్ చేశారు. ఆ వీడియోను ఎక్స్ వేదికగా వీసీ సజ్జనార్ పోస్ట్ చేశారు.

‘పిచ్చి పలురకాలు.. వెర్రి వేయి రకాలు.. అంటే ఇదే! సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి ఎంతకైనా తెగిస్తారా? ఎలాంటి కంటెంట్ చేస్తున్నారో కనీసం సోయి ఉండక్కర్లేదా? ఎంతో మంది యువత భవిష్యత్‌ను చిత్తు చేస్తున్న నిషేధిత డ్రగ్స్‌పై వీడియోలు చేస్తూ.. సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు.. చెప్పండి? సోషల్ మీడియాకు బానిసై (reels) రీల్స్ పిచ్చి పట్టిన ఇలాంటి మానసిక రోగులకు దూరంగా ఉండండి. వ్యూస్, లైక్స్, కామెంట్స్ మాత్రేమే వీళ్లకు కావాలి. రాత్రికి రాత్రే పాపులర్ అయ్యేందుకు ఏమైనా చేస్తారు. సమాజం ఎటుపోయిన, ఎవరు ఏమైపోయిన వీళ్లకు సంబంధం లేదు’ అని ట్వీట్‌లో వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.

Next Story