- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రతి నెల జాబ్ మేళా: వీసీ ఘంటా చక్రపాణి కీలక వ్యాఖ్యలు
డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ(Ambedkar Open University)లో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి (Ghanta Chakrapani) పేర్కొన్నారు. ఇన్ఫింక్స్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో శుక్రవారం విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో ప్రత్యేకంగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీల సహకారంతో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు, అలాగే ప్రతి నెల ఒక జాబ్ మేళా నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నట్లు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ జాబ్ మేళా ప్రత్యేకంగా 2024, 2025 బ్యాచ్‌లలో ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం నిర్వహించినట్లు విశ్వవిద్యాలయ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డా. వేణు గోపాల్ రెడ్డి వివరించారు. ఈ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు ఇన్ఫింక్స్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారులు వెంటనే ఉద్యోగ నియామక పత్రాలను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. పుష్ప చక్రపాణి, ఈఎంఆర్ అండ్ ఆర్ సీ డైరెక్టర్ ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్, ప్లేస్‌మెంట్ అధికారి డా. పి. వేణు గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఇన్ఫింక్స్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి అధికారులు మనోహర్ రామగల్ల, సాయి కృష్ణ, నవదీప్ సాయి ఉద్యోగ మేళాకు ఇంటర్వ్యూ బోర్డు సభ్యులుగా వ్యవహరించారు.






