అధికారికంగా వాసవీ అమ్మవారి జయంతి : ఉత్తర్వులు జారీ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

by Naga Rani Yarlagadda |

ఆర్య వైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవీ అమ్మ వారి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించనున్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అధికారికంగా వాసవీ అమ్మవారి జయంతి : ఉత్తర్వులు జారీ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
X
  • కల్వ సుజాత ఆధ్వర్యంలో ఆర్య వైశ్య సంఘాల సంబరాలు

దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్య వైశ్యుల ఇలవేల్పు, ఆరాధ్య దైవం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవీ అమ్మ వారి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించనున్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కల్వ సుజాత హర్షం వ్యక్తం చేశారు. గురువారం గాంధీ భవన్ లో , ఆర్యవైశ్య కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆర్యవైశ్యులు టపాసులు పేల్చి, మిఠాయిలు పంచి, సంబురాలు జరుపుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కల్వ సుజాత మాట్లాడుతూ సాధ్యం కాదనుకున్న తమ చిరకాల వాంచను నెరవేర్చిన కాంగ్రెస్ సర్కారుకు ఆర్యవైశ్య జాతి రుణ పడి ఉంటుందన్నారు. కల్వ సుజాత ఆధ్వర్యంలో కాగా జంట నగరాలతో పాటు అన్ని జిల్లాల్లో ఆర్య వైశ్య సంఘాలు, ఆర్య వైశ్య క్లబ్బులు మహిళా సంఘాల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేసి, కృతజ్ఞతలు తెలిపారు. గాంధీ భవన్ లో జరిగిన సంబరాల్లో కల్వ సుజాత తో పాటు ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, హైదరాబాద్ జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు కూన కిట్టు, మాజీ అధ్యక్షులు సరబ్ లక్ష్మణ్, ఆకుల రమాకాంత్ పాటు వివిధ జిల్లాల ఆర్య వైశ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story