- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth: బాసరలో వసంత పంచమి ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో 2026 సంవత్సరంలో జరగనున్న వసంత పంచమి (శ్రీ పంచమి) ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. మంత్రి కొండా సురేఖ, బాసర దేవస్థానం ఈవో, అర్చకులు కలిసి సీఎంని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సంక్రాంతి పండుగ సందర్భంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో నిర్వహించనున్న సంబురాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సోమవారం ప్రజా ప్రతినిధులు ఆహ్వానించారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, శాసనసభ్యులు దానం నాగేందర్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కూడా హాజరయ్యారు.
అలంపూర్‌లో అమ్మవారి బ్రహ్మోత్సవాలు
అదేవిధంగా, అలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. మంత్రి కొండా సురేఖ, ఆలయ ఈవో, అర్చక బృందం కలిసి ఈ నెల 19 నుంచి 23 వరకు జరగనున్న శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు.
వసంత పంచమి వేడుకలు
ఇక బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో 2026 సంవత్సరంలో జరగనున్న వసంత పంచమి (శ్రీ పంచమి) ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. మంత్రి కొండా సురేఖ, బాసర దేవస్థానం ఈవో, అర్చకులు కలిసి సీఎంని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ పంచమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.






