- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్యూచర్ సిటీలో జూ.. సీఎం రేవంత్‌తో ఎంఓయూ చేసుకున్న వంతారా బృందం
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ కు దక్షిణభాగంలో ఈ సిటీని నిర్మిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ కు దక్షిణభాగంలో ఈ సిటీని నిర్మిస్తున్నారు. కాగా ఫ్యూచర్ సిటీలో ప్రస్తుతం తెలంగాణ రైజింగ్ సమ్మిట్ జరుగుతోంది. ఈ సమ్మిట్ లో దేశ, విదేశాల నుండి వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించగా పలు కంపెనీలు ఒప్పందం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి.
కాగా ఇదే కార్యక్రమంలో ఫ్యూచర్ సిటీలో భారీ జూపార్క్ నిర్మాణానికి వంతారా బృందం సీఎం రేవంత్ రెడ్డితో ఎంఓయూ కుదుర్చుకుంది. వంతారా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేటు జంతు సంరక్షణ కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సంరక్షణ కేంద్రం ముంబైలోని జామ్ నగర్ లో ఉంది. దీని నిర్వహణ బాధ్యతలను అంబానీ తనయుడు అనంత్ అంబానీ చూసుకుంటున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదరడంతో ఫ్యూచర్ సిటీలో ఏ రేంజ్ లో జూ కట్టబోతున్నారు అనేని ఆసక్తికరంగా మారింది.






