అసెంబ్లీలో వందేమాతరం గీతాలాపన.. ఎంఐఎం ఎమ్మెల్యేల వాకౌట్!

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-16 14:52:30  IST  )

తెలంగాణ అసెంబ్లీలో వందేమాతరం గీతాలాపనను నిరసిస్తూ ఇవాళ ఎంఐఎం ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.

అసెంబ్లీలో వందేమాతరం గీతాలాపన.. ఎంఐఎం ఎమ్మెల్యేల వాకౌట్!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే సభలో పొలిటికల్ హీట్ రాజుకుంది. అసెంబ్లీలో ‘వందేమాతరం’ (Vandemataram) గీతాలాపన చేయడాన్ని నిరసిస్తూ ఎంఐఎం (MIM) సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు సభలో వందేమాతరం గీతాన్ని ప్లే చేశారు. అయితే, దీనిపై ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ నిరసన వ్యక్తం చేస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా వాకౌట్ చేశారు. గీతాలాపన ముగిసే వరకు వారు సభలోకి అడుగు పెట్టలేదు. అయితే, గతంలోనూ వందేమాతరం గీతాలాపన సందర్భాల్లో ఎంఐఎం సభ్యులు ఇదే తరహాలో వ్యవహరించిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా బడ్జెట్ సమావేశాల తొలిరోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం సభలో తీవ్ర చర్చకు దారితీసింది.

తెలంగాణ అసెంబ్లీలో 'వందేమాతరం' రగడ: ఎంఐఎం వాకౌట్.. బీజేపీ ఎమ్మెల్యేల తీవ్ర ఆగ్రహం

మార్చి 30 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

Next Story