గుడ్‌న్యూస్.. సెప్టెంబర్ 18 నుంచే సిర్పూర్ కాగజ్‌నగర్‌లో వందేభారత్ స్టాప్

by Ramesh Naini |

ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

గుడ్‌న్యూస్.. సెప్టెంబర్ 18 నుంచే సిర్పూర్ కాగజ్‌నగర్‌లో వందేభారత్ స్టాప్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్. ప్రయాణికుల సౌకర్యార్థం (South Central Railway) దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్–నాగపూర్–సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat) రైళ్లకు సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్‌లో అదనపు స్టాప్ కల్పించింది. ఈ నెల 18వ తేదీ నుండి (సికింద్రాబాద్–నాగపూర్ వందేభారత్), అలాగే 19వ తేదీ నుండి (నాగపూర్–సికింద్రాబాద్ వందేభారత్) రైళ్లకు ఈ స్టాప్ అమల్లోకి రానుంది. రైలు నంబర్ 20102 (సికింద్రాబాద్–నాగపూర్ వందేభారత్) సిర్పూర్ కాగజ్ నగర్ కు సాయంత్రం 4.14కు చేరుకుని, 4.15కి బయల్దేరుతుంది.

రైలు నంబర్ 20101 (నాగపూర్–సికింద్రాబాద్ వందేభారత్) సిర్పూర్ కాగజ్ నగర్ కు ఉదయం 8.09కు చేరుకుని, 8.10కి బయల్దేరుతుంది. ఈ నిర్ణయం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు ద.మ.రైల్వే సీపీఆర్ఓ ఏ శ్రీధర్ వెల్లడించారు. కాగా.. ఈ నెల 15న (సోమవారం) నుంచి మంచిర్యాల స్టేషన్ లో ఈ రైలు ఆగుతుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ జెండా ఊపి మంచిర్యాల నుంచి ఈ రైలును ప్రారంభించారు. నాగపూర్ నుంచి బయలుదేరే ఈ రైలు మార్గమధ్యలో సేవాగ్రామ్, చంద్రాపూర్, బలార్షా, రామగుండం, కాజీపేట, స్టేషన్లలో ఆగి సికింద్రాబాద్ చేరుకునేది. సోమవారం నుంచి మంచిర్యాల, ఈ నెల 18వ తేదీ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ లోనూ ఆగనుంది. ఫలితంగా తెలంగాణలోని ప్రయాణికులకు ఈ రైలు సేవలు మరింతగా ఉపయోగపడనున్నాయి.

Next Story