- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vanajeevi Ramaiah: ఇంటి పేరే కాదు.. మనుమళ్లు, మనుమరాళ్లకు చెట్ల పేర్లు
ఆయనకు మొక్కలు నాటడంటే ఎంతో ఇష్టం. జీవితమంతా మొక్కలు నాటి పెంచి వృక్షో రక్షతి రక్షిత: అంటూ ప్రచారం చేశారు....

దిశ, వెబ్ డెస్క్: ఆయనకు మొక్కలు నాటడమంటే ఎంతో ఇష్టం. జీవితమంతా వృక్షో రక్షతి రక్షిత: అంటూ ప్రచారం చేశారు. రోడ్ల పక్కన, ఆస్పత్రులు, ఆలయాలతో పాటు చాలా ప్రాంతాల్లో వేలల్లోనే మొక్కలు నాటారు. 50 ఏళ్లుగా విత్తనాలు చల్లుతూ మొక్కలు పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఆయనే వనజీవి రామయ్య(Vanajeevi Ramaiah).
ఖమ్మం జిల్లా(Khammam District) రూరల్ మండలం రెడ్డిపల్లి(Reddypally)లో జన్మించిన రామయ్య.. మొక్కల పెంపకం( Plants Cultivation)పై చిన్నప్పటి నుంచి మక్కువపెంచుకున్నారు. ఇంటి పేరు దరిపల్లి అయినప్పటికీ వనజీవిగా మార్చుకున్నారు. ఆయనకు చెట్ల రామయ్య అనే పేరు కూడా ఉంది. వేసవిలో రోడ్ల వెంట, చెట్ల వద్ద తిరుగుతూ విత్తనాలు సేకరిస్తారు. తొలకరి రాగానే ఆయా ప్రాంతాల్లో చల్లుతుంటారు. ఇలా 120 రకాల మొక్కల చరిత్రను చాలా ఈజీగా చెప్పగలరు. మూడు కోట్ల మొక్కలు నాటాలనేదే తాను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకూ కోటి పైగానే మొక్కలు నాటారు. దీంతో ట్రీమ్యాన్ ఆఫ్ ఇండియాగా ఆయన గుర్తింపు పొందారు. మొక్కలు నాటడంతో ఆయన చేసిన సేవలకు కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది.
అయితే మొక్కలపై ఉన్న ప్రేమతో తన మనుమళ్లకు , మనవరాళ్లకు చెట్ల పేర్లే పెట్టారు. ఒక మనుమరాలు పేరు చందనపుష్ఫ, మరో మనుమరాలు పేరు హరిత లావణ్య, ఇంకో పాపకు కుంబంధపుష్ప అని పెట్టారు. నాలుగో మనమరాలికి వనశ్రీ అని పేరు పెట్టారు.
అలాంటి వనజీవి ప్రస్తుతం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయనకు శనివారం ఉదయం గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. విషయం బయటకు తెలియడంతో ప్రకృతి ప్రేమికులు శోకసంద్రంలో మునిగిపోయారు.వనజీవి రామయ్య మృతి పట్ల ప్రముఖుుల, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.






