Gandhi Bhavan: సీఎం రేవంత్ బీసీ పక్షపాతి.. కులగణన సభలపై వీహెచ్ కీలక వ్యాఖ్యలు

by Ramesh N |
Gandhi Bhavan: సీఎం రేవంత్ బీసీ పక్షపాతి.. కులగణన సభలపై వీహెచ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బీసీ పక్షపాతి అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (V Hanumantha Rao) అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. (caste census) కులగణన చేసి బీసీలకు మేము న్యాయం చేస్తున్నామని, ఈ క్రమంలోనే సూర్యాపేటలో రాహుల్ గాంధీతో సభ పెడుతున్నామని చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ చేసినందుకు గజ్వేల్‌లో మలికార్జున ఖర్గేతో సభ పెడుతున్నట్లు స్పష్టం చేశారు. కుల గణన అంశంపై మీడియాతో మాట్లాడటం కాదు ప్రజల్లోకి పోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం క్రిమిలేయర్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా తాను అక్కడికి పోయి న్యాయ పోరాటం చేస్తున్నట్లు చెప్పారు.

(BJP) బీజేపీ మీద పోరాటం చేయాలని, బీజేపీకి రిజర్వేషన్ ఇవ్వాలని లేదని విమర్శించారు. అంబేద్కర్‌ను అవమానించింది అమిత్ షా కాదా? అని ప్రశ్నించారు. అంబేద్కర్‌ బదులు దేవున్ని పూజిస్తే స్వర్గానికైనా వెళ్తారని రాజ్యసభలో అమిత్ షా అవమానించారని, ఇప్పటివరకు క్షమాపణ చెప్పలేదని మండిపడ్డారు. అయోధ్యలో గుడి కట్టిన తర్వాతే నిజమైన స్వాతంత్రం వచ్చిందని మోహన్ భగవత్ అన్నారని గుర్తుకు చేశారు. రాహుల్ గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని, వాళ్లను కూడా అవమాన పరుస్తున్నారని తెలిపారు.

Next Story

Most Viewed