- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిపబ్లిక్ డే రోజు రాహుల్ గాంధీకి అవమానం! వీహెచ్ తీవ్ర ఆరోపణలు
రిపబ్లిక్ డే రోజు అపోజిషన్ లీడర్స్‌కి అవమానం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్ర ఆరోపణలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రిపబ్లిక్ డే రోజు అపోజిషన్ లీడర్స్‌కి అవమానం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రిపబ్లిక్ డే రోజు అపోజిషన్ లీడర్స్‌కి అవమానం జరిగిందని, ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో భాగంగా పరేడ్‌లో సిట్టింగ్ అరెంజ్‌మెంట్ విషయంలో అపోజిషన్ లీడర్ ఇంపార్టెన్స్ ఇవ్వలేదని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కి మూడో లైన్ లో అలొకేట్ చేయడం సరికాదన్నారు. గతంలో మొదటి లైన్ లో కూర్చోబెట్టే సంస్కృతి ఉండేదన్నారు. అపోజిషన్ లీడర్ కి సరైన స్థానం ఇవ్వాలి అని రాజ్యాంగంలో ఉందన్నారు. బీజేపీ హిట్లర్ పాలన తలపిస్తోంది.. దేశాన్ని ముక్కలు చేసి ప్రభుత్వంలో కొనసాగాలి అని బీజేపీ చేస్తుందని విమర్శించారు. బీజేపీ రాజ్యాంగాన్ని గౌరవించరని, జాతిపితని గౌరవించరని మండిపడ్డారు. బాబా సాహెబ్ అంబేడ్కర్‌ని సైతం అవమానించారని, ఈ డిక్టెటర్ పాలనని తాను ఖండిస్తున్నట్లు ఫైర్ అయ్యారు.






