బీసీలను మోదీ మోసం చేస్తున్నారు.. వీహెచ్ ఫైర్

by Ajay Maddhiboyina |

బీసీల లెక్క తీయకపోతే తమకు న్యాయం జరగదని, బీసీలను మోదీ మోసం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు వి.హన్మంతరావు విమర్శించారు. బీసీలపై మోదీకి చిత్తశుద్ధి లేదని, అంబానీ, అదానీలకు మాత్రమే మోదీ సహాయం చేస్తారని విమర్శించారు.

బీసీలను మోదీ మోసం చేస్తున్నారు.. వీహెచ్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీసీల లెక్క తీయకపోతే తమకు న్యాయం జరగదని, బీసీలను మోదీ మోసం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు వి.హన్మంతరావు విమర్శించారు. బీసీలపై మోదీకి చిత్తశుద్ధి లేదని, అంబానీ, అదానీలకు మాత్రమే మోదీ సహాయం చేస్తారని విమర్శించారు. సోమవారం ఆయన గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మేం అడుక్కునే వాళ్ళలాగా కనిపిస్తున్నామా? మోదీలో ఇప్పటికైనా మార్పు రావాలని ఆయన హితవు పలికారు. బీసీల పట్ల రేవంత్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి మోదీకి లేదు తెలంగాణలో బీజేపీ ఎలా అధికారంలోకి వస్తుందో చూస్తామని వీహెచ్ సవాల్ విసిరారు. బీసీ కులగణన చేయమని మోదీకి పవన్ కళ్యాణ్ చెప్పాలన్నారు. ఓబీసీ కాలం లేకపోతే జనగణనలో బీసీలు పాల్గొనకండి అని వీహెచ్ పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీపై మోదీ దుర్మార్గమైన వాఖ్యలు చేశారని, కాంగ్రెస్ పార్టీని ముస్లిం, మావోవాదీ పార్టీ అనడం తప్పు అని వీహెచ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముస్లింలు మనుషులు కాదా? ముస్లింలు దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారన్నారు. మోదీ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారని, ఆయన ఆర్ఎస్సెస్ ఏం చెప్తే అది చేస్తారని ఆరోపించారు.

Next Story