- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సొంత పార్టీపై వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
by Malleboina Mahesh |
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సొంత పార్టీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ పదవుల్లో బీసీల ప్రాధాన్యత పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సొంత పార్టీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ పదవుల్లో బీసీల ప్రాధాన్యత పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బీసీలను పార్టీకి దగ్గర చేర్చుకోవాలని అప్పుడే పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన రిజర్వేషన్లను పెంచాలనే రాహుల్ గాంధీ ఆలోచనను స్వాగతిస్తున్నామన్నారు. బీసీ జనగణన చేపట్టడంతో పాటు క్రీమిలేయర్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఈ అంశంలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఎన్నిసార్లు కోరినా స్పందన లేదని అన్నారు. హైకోర్టుకు వెళ్లే దారిలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని దీని కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ అసద్‌లకు లేఖ రాసినట్లు వీహెచ్ తెలిపారు. పాతబస్తీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.
- Tags
- VH
- congress party
Next Story






