తెలంగాణ బియ్యంపై ఫిలిప్పీన్స్ మంత్రి ప్రశంసలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-06 10:14:35  IST  )

ఫిలిప్పీన్స్ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి ఫ్రాన్సిస్కో లారెన్ జూనియ‌ర్‌తో తెలంగాణ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ బియ్యం నాణ్యతపై మంత్రులు చర్చించారు.

తెలంగాణ బియ్యంపై ఫిలిప్పీన్స్ మంత్రి ప్రశంసలు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఫిలిప్పీన్స్ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి ఫ్రాన్సిస్కో లారెన్ జూనియ‌ర్‌తో తెలంగాణ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ బియ్యం నాణ్యతపై మంత్రులు చర్చించారు. ఫిలిప్పీన్స్‌కు బియ్యం, వరి ఎగుమతుల పరిధిని విస్తరించడంపై చర్చించారు. రాబోయే సంవత్సరంలో తమ దేశానికి బియ్యం, వరి దాదాపు 2 ఎంఎంటీ ఉండవచ్చని ఫ్రాన్సిస్కో అన్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ... ఫిలిప్పీన్స్ కు పెద్దఎత్తున బియ్యం ఎగుమితి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలిపారు. ఈ మేర‌కు ఫిలిప్పీన్స్ వ్య‌వ‌సాయ శాఖ మంత్రిని తెలంగాణ‌కు ఆహ్వానించిన‌ట్టు వెల్లడించారు. తెలంగాణ బియ్యం మంచి నాణ్య‌త‌తో ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పార‌న్నారు. తెలంగాణ బియ్యం నాణ్యతను గుర్తించినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Next Story