- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్రంతో పొత్తు ఉందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతావా?.. నారా లోకేష్‌పై మంత్రి ఉత్తమ్ ఫైర్
బనకచర్ల ప్రాజెక్టు(Banakacherla Project)పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బనకచర్ల ప్రాజెక్టు(Banakacherla Project)పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) వ్యాఖ్యలు సరికాదు.. లోకేష్ వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి ఉత్తమ్ అన్నారు. కేంద్రంలో బీజేపీ, టీడీపీ పొత్తు ఉందని.. లోకేష్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్య దేశమని గుర్తుచేశారు. పొత్తులు ఉన్నాయని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు సహించరు అని చెప్పారు. వంద వందశాతం బనకచర్ల ప్రాజెక్టుపై చట్టవిరుద్ధమైదని అన్నారు.
దీనిపై ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధమని ప్రకటించారు. అంతకుముందు బనకచర్ల ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదన్నారు. కనీసం గతంలో కాంగ్రెస్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులను కూడా ఆ పార్టీ పూర్తి చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. కృష్ణానదిపై ఒక్క ప్రాజెక్టు కూడా ఎందుకు కట్టలేదు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ నిర్మించే ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయిన తర్వాత బనకచర్ల కట్టుకోవచ్చు అని భట్టి స్పష్టం చేశారు.






