- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG News : రైతులకు ఉత్తమ్ గుడ్ న్యూస్.. వాటికి వెంటనే బోనస్
రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uthham Kumar Reddy) గుడ్ న్యూస్ తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్ : రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uthham Kumar Reddy) గుడ్ న్యూస్ తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu)తో కలిసి యాసంగి ధాన్యం కొనుగోలుపై జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఉత్తమ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యసంగీ ధాన్యం కొనుగోలు ఎలాంటి అడ్డంకులు లేకుండా వేగంగా జరిగేలా చూడాలని తెలియజేశారు. ఈ యాసంగిలో 137.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నామని అన్నారు. ధాన్యం కొనుగోళ్లు జరిగిన వెంటనే రైతుల ఖాతాలకు నగదు జమ చేసేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. అలాగే సన్నవడ్లకు బోనస్ లు కూడా తక్షణమే జమ చేస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు.
ఇక మంత్రి శ్రీధన బాబు మాట్లాడుతూ.. ఆయా జిల్లాల్లో అకాలవర్షానికి ధాన్యం తడిసిపోయినట్టు తమకు సమాచారం అందింది అని, అలాంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని, ఏ ఒక్క రైతు కూడా కన్నీరు పెట్టకుండా చూసుకోవాలని సలహా ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అలస్యాన్ని సహించబోనని, అలాంటివి ఏవైనా తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటానని అధికారులను శ్రీధర్ బాబు హెచ్చరించారు.






