సీఎం రేవంత్ రెడ్డితో డెలావర్ గవర్నర్ భేటీ

by Prasad Jukanti |

తెలంగాణ ప్రతినిధుల బృందంతో డెలావర్‍కు రావాల్సిందిగా సీఎంను మాట్ మేయర్ ఆహ్వానించారు.

సీఎం రేవంత్ రెడ్డితో  డెలావర్ గవర్నర్ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో USA డెలావర్ ( Delaware) రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ ( Matt Mayer) భేటీ అయ్యారు. హెల్త్, ఎడ్యుకేషన్ రంగంలో సంస్కరణలపై ఈ సమావేశంలో సీఎంతో మాట్ మేయర్ చర్చించారు. డెలావర్ రాష్ట్రంలో అమలు చేసిన పేద మధ్యతరగతి ప్రజలకు ఇండ్లు, రుణమాఫీ ఇతర అంశాలను మ్యాట్ మేయర్ ముఖ్యమంత్రికి వివరించారు. డేటా ప్రివెన్షన్, యూనివర్సల్ హెల్త్ కేర్‍పై చర్చించారు. తెలంగాణ ప్రతినిధుల బృందంతో డెలావర్‍కు రావాల్సిందిగా సీఎంను మాట్ మేయర్ ఆహ్వానించారు. భవిష్యత్‍లో తెలంగాణ, డెలావర్ మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, ఫస్ట్ లేడీ ఆఫ్ డెలావర్ లారెన్ మేయర్ (Lauren Meyer), ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story