- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. కోర్టుకెక్కిన యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవలే హెచ్-1B (H1-B) వీసా ఫీజును రూ.లక్ష డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవలే హెచ్-1B (H1-B) వీసా ఫీజును రూ.లక్ష డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ నిర్ణయంపై సొంత దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు, సాంకేతిక, ఇంజినీరింగ్ రంగాల్లోని నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రంప్ ప్రకటించిన హెచ్-1B లక్ష డాలర్లు ఫీజు పూర్తిగా చట్ట విరుద్ధమని యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (US Chamber Of Commerce) కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నిర్ణయంతో దేశంలో గ్లోబల్ టాలెంట్‌ను వాడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని వారు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.
అదేవిధంగా ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్‌ను ట్రంప్ ఉల్లంఘిస్తున్నారని.. వీసా ఫీజు పెంచడం వల్ల ఇతర దేశాల నుంచి వచ్చే అప్లికేషన్లు తగ్గి ప్రభుత్వా ఆదాయానికి గండిపడే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా స్టార్టప్‌లు, చిన్న మధ్య తరహా వ్యాపారులు తీవ్రంగా నష్టాపోతారని పేర్కొన్నారు. ఫీజు పెంపు వల్ల కంపెనీలు తమ ఎంప్లాయిస్ ఖర్చులను గణనీయంగా పెంచుకోవాల్సి వస్తుందని, లేని పక్షంలో తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకోవాల్సి వస్తుందని యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో తన వాదనలు వినిపించనుంది.






