తెలంగాణలో తీరనున్న యూరియా కష్టాలు.. ఫలించిన మంత్రి తుమ్మల ప్రయత్నం

by Gantepaka Srikanth |

తెలంగాణలో యూరియా(Urea) కష్టాలు తీరనున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala Nageswara Rao) ప్రయత్నాలు ఫలించాయి.

తెలంగాణలో తీరనున్న యూరియా కష్టాలు.. ఫలించిన మంత్రి తుమ్మల ప్రయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో యూరియా(Urea) కష్టాలు తీరనున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala Nageswara Rao) ప్రయత్నాలు ఫలించాయి. తుమ్మల విజ్ఞప్తితో అదనంగా యూరియా కేటాయింపునకు కేంద్రం అంగీకరించింది. ఇప్పటికే కేటాయించిన 40 వేలమెట్రిక్ టన్నులతో పాటు మరో 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించింది. దీంతో తెలంగాణకు మొత్తం 80 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. గత ఏడాదికన్నా ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరగడంతో తెలంగాణ వ్యాప్తంగా రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. దీంతో పలు జిల్లాల్లో రైతులు యూరియా కోసం ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి తుమ్మల కేంద్ర పెద్దలతో సమావేశమై అదనపు యూరియా కోసం ప్రయత్నాలు చేశారు.

Next Story