ఆపరేషన్ సిందూర్ వల్లే యూరియా కొరత : ఎంపీ రఘునందన్ రావు

by Muthe.Rajitha |

తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఆపరేషన్ సిందూర్ వల్లే యూరియా కొరత : ఎంపీ రఘునందన్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఖరీఫ్ సీజన్‌లో యూరియా కొరత కారణంగా రైతులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని అన్నారు. అయితే యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "ఆపరేషన్ సిందూర్" కారణమని అన్నారు. ఆపరేషన్ సిందూర్ వలన చైనా నుంచి రావాల్సిన 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా ఆగిపోవడం వల్ల ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఈ సమస్యను రాజకీయంగా వాడుకుంటూ, రైతులను తప్పుదారి పట్టిస్తున్నాయని, వారి మాటలను నమ్మి రైతులు అనవసర ధర్నాలు, ఆందోళనలు చేయవద్దని కోరారు.

రైతులకు యూరియా సరఫరా చేసే బాధ్యత తమదేనని, ఈ సమస్య వల్ల రైతులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని రఘునందన్ రావు పేర్కొన్నారు. ఇప్పుడైనా, ఇంతక ముందు అయినా యూరియా సరఫరా చేసేది కేంద్ర ప్రభుత్వమేనని, అంతేగాని కేటీఆర్ అన్నట్టు మా నాన్నగారు ఉన్నపుడు ఇలా జగరలేదు అనడం హాస్యస్పదం అన్నారు. కేంద్రం పంపిన యూరియాను రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా పంపిణీ చేయలేకపోయిందని, కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బంది పెడుతున్నారని కూడా తెలుస్తోందని ఎంపీ పేర్కొన్నారు.

Next Story