- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
DGP ఎంపికపై ఢిల్లీలో UPSC కమిటీ భేటీ.. హజరైన CS రామకృష్ణా రావు
by Kema Shiva Kumar |
తెలంగాణ పూర్తి స్థాయి డీజీపీ ఎంపిక ప్రక్రియ వేగవంతమైంది. ఢిల్లీలో జరిగిన యూపీఎస్సీ ఎంప్యానెల్ కమిటీ సమావేశానికి సీఎస్ రామకృష్ణారావు హాజరయ్యారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి పూర్తి స్థాయి డీజీపీ ఎంపిక ప్రక్రియపై దేశ రాజధాని ఢిల్లీలో యూపీఎస్సీ ఎంప్యానెల్ కమిటీ బుధవారం సమావేశమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు హాజరయ్యారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం పంపిన అర్హులైన ఐపీఎస్ అధికారుల జాబితాను కమిటీ పరిశీలించింది. ఈ జాబితా నుంచి ముగ్గురు పేర్లను షార్ట్‌లిస్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌తో పాటు వినాయక ప్రభాకర్ ఆప్టే, శిఖా గోయల్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. వీరిలో ఒకరిని డీజీపీగా ఎంపిక చేయనున్నట్లు సమాచారం.
Next Story






