- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెస్సీ vs సీఎం.. ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం ముస్తాబైన ఉప్పల్ స్టేడియం
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఆడబోయే ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం ముస్తాబైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఆడబోయే ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం ముస్తాబైంది. ఇప్పటికే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఉప్పల్‌లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ భద్రత నడుమ ఈ మ్యాచ్ జరగనుంది. మెస్సీకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ, 3,500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఈవెంట్ కోసం స్టేడియం అధికారులు మొత్తం రూ.50 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్టేడియం మౌలిక వసతుల పునరుద్ధరణలో భాగంగా, కుర్చీలు, లైటింగ్, షెడ్లు, బాత్రూములు మొదలైన వాటి మరమ్మతులు చేసినట్లు తెలుస్తోంది. ఈ RGI స్టేడియంలో 59 కార్పొరేట్ బాక్సుల సామర్థ్యంతో 38,000 మంది ప్రేక్షకులను ఆతిథ్యం ఇవ్వగలదు.. ఈ స్టేడియం ఇప్పటికే అనేక క్రికెట్ లీగ్‌లు, మ్యాచ్‌లు కూడా నిర్వహించిన విషయం తెలిసిందే.
రేపు (శనివారం) మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య కోల్‌కతా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. అక్కడినుంచి గ్రీన్ ఛానల్ ద్వారా తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లనున్నారు. అక్కడ అభిమానులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు మెస్సీ ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ చిన్నారుల ఫుట్‌బాల్ జట్టుతో 15 నిమిషాలపాటు మాట్లాడానున్నారు. సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో అందరూ ఎదురుచూస్తున్న ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది. సింగరేణి ఆర్ఆర్ జట్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తుండగా, అపర్ణ టీమ్ తరఫున మెస్సీ ఆడనున్నారు. చివరి ఐదు, పది నిమిషాల మ్యాచ్‌లో మెస్సీతో గ్రౌండ్‌లో సీఎం ఆడనున్నట్లు తెలిపారు. మెస్సీతో పాటు అతని స్నేహితులైన రోడ్రిగో, లూయిస్ సురేజ్ కూడా ఈ మ్యాచ్‌లో పాల్గొనబోతున్నారు.






