హోరెత్తుతున్న ఉప్పల్ స్టేడియం.. గోల్ కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-13 15:08:05  IST  )

సాకర్ దిగ్గజం రాకతో ఉప్పల్ స్టేడియం హోరెత్తుతోంది.

హోరెత్తుతున్న ఉప్పల్ స్టేడియం.. గోల్ కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: సాకర్ దిగ్గజం రాకతో ఉప్పల్ స్టేడియం హోరెత్తుతోంది. గ్రౌండ్‌లోకి సింగరేణి ఆర్ఆర్ జట్టు తరఫున సీఎం రేవంత్ రెడ్డి, అపర్ణ టీమ్ తరఫున లియోనల్ మెస్సి బరిలోకి దిగారు. అయితే, తొలుత గోల్ చేసిన అపర్ణ టీమ్ మ్యాచ్‌లో ముందు ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి చాకచక్యంగా గోల్ చేసి స్కోర్‌ను 1-1 పాయింట్లతో సమం చేశారు. అనంతరం లియోనెల్ మెస్సి పెనాలిటీ షూట్ అవుట్‌కు దిగి ఏకంగా రెండు గోల్స్ చేయడంతో మ్యాచ్ ముగిసింది. అనంతరం మెస్సితో పాటు సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్‌కు వచ్చిన అభిమానులకు గ్రౌండ్‌లో తిరుగుతూ అభివాదం చేశారు. ఆ తర్వాత సింగరేణి ఆర్ఆర్, అపర్ణ టీమ్ జట్లతో వారు గ్రూప్ ఫొటోలు దిగారు.

Next Story