TG: సమ్మె కారణంగా నిలిచిపోయిన పరీక్షల అప్డేట్

by Gantepaka Srikanth |

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)తో జరిపిన చర్చలపై ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ తెలంగాణ హైయ్యర్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (FATHI) ప్రెసిడెంట్ స్పందించారు.

TG: సమ్మె కారణంగా నిలిచిపోయిన పరీక్షల అప్డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)తో జరిపిన చర్చలపై ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ తెలంగాణ హైయ్యర్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (FATHI) ప్రెసిడెంట్ స్పందించారు. దేవసేన, సీఎంవో అధికారులపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టత ఇచ్చారు. కొందరు తమ వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. ఇప్పటికే తమ ఖండనను అధికారులకు పంపించినట్లు తెలిపారు. సమ్మె కారణంగా నిలిచిపోయిన పరీక్షలను యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి త్వరలోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

కాగా, శుక్రవారం సాయంత్రం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో చర్చల అనంతరం బంద్‌ విరమిస్తున్నట్టు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రకటించింది. ప్రైవేటు కాలేజీలకు ఫీజు బకాయిలు చెల్లింపునకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తక్షణమే రూ.600 కోట్లు విడుదలకు డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. మరో రూ.300 కోట్లు త్వరలో చెల్లించేందుకు హామీ ఇచ్చారు. గతంలోనూ రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్లు ఫీజు బకాయిలు చెల్లించింది. ప్రభుత్వంతో కాలేజీల యాజమాన్యాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో కళాశాలలు యథావిధిగా తెరుచుకోనున్నాయి.

Next Story