ఉపసర్పంచ్ చెక్ పవర్ రద్దు కాలేదు : మంత్రి సీతక్క క్లారిటీ

by Muthe.Rajitha |   (  Updated:2025-12-23 13:25:33  IST  )

ఉప సర్పంచ్ ల చెక్ పవర్ రద్దుపై కొనసాగుతున్న ప్రచారానికి పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ముగింపు పలికారు.

ఉపసర్పంచ్ చెక్ పవర్ రద్దు కాలేదు : మంత్రి సీతక్క క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఉప సర్పంచ్ ల చెక్ పవర్ రద్దుపై కొనసాగుతున్న ప్రచారానికి పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ముగింపు పలికారు. ఉప సర్పంచ్ ల చెక్ పవర్ రద్దు అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అన్నారు. ప్రభుత్వం అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని సీతక్క స్పష్టం చేసారు. ఉప సర్పంచ్ ల అధికారాల విషయంలో జరుగుతున్నా అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని కోరారు. సోషల్ మీడియాలో లేదా ఇతర మీడియా వేదికల్లో ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంచాయితీరాజ్ వ్యవస్థ బలోపేతానికి ప్రభఉత్వం కట్టుబడి ఉన్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయానికి తావులేదని సీతక్క క్లారిటీ ఇచ్చారు. కాగా సీతక్క ప్రకటనపై ఉప సర్పంచులు ఊపిరి పీల్చుకున్నారు.

తెలంగాణలో ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు అంటూ

Next Story