తెలంగాణలో ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు అంటూ..

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-23 12:05:05  IST  )

తెలంగాణలో ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు అంటూ..

తెలంగాణలో ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు అంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఉప సర్పంచ్‌లకు చెక్‌ పవర్ రద్దు అంటూ వార్తలు విస్తృతమైన విషయం తెలిసిందే. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సర్క్యూలర్ ఫేక్ అని కొట్టిపారేస్తున్నాయి. కాగా, ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. అన్ని గ్రామ పంచాయతీలో అధికారులు కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు, ఉపసర్పంచులతో ప్రమాణస్వీకారాలు చేయించారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన బాధ్యతలను అప్పచెప్పారు. గ్రామాల్లో ఇప్పటి వరకు కొనసాగిన ప్రత్యేక అధికారుల పాలన సర్పంచులు, వార్డు సభ్యుల రాకతో ముగిసిపోయింది. కాగా, 2018 పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం గ్రామాల్లో ఉప సర్పంచికి జాయింట్‌ చెక్‌ పవర్‌ ఇవ్వడంతో ఇన్నాళ్లు ఆ పదవి కీలకంగా మారింది. వైరల్‌గా మారిన సర్క్యూలర్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

Next Story