Padi Kaushik Reddy : తగ్గని పాడి కౌశిక్ రెడ్డి..గ్రామసభలో సర్కార్ పై ఫైర్

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-23 07:06:27  IST  )

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress governmen)పై నిరంతరం(Regular) ఒంటికాలిపై లేచే(Attack) బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) తనపై ప్రభుత్వం వరుస కేసులు నమోదు చేస్తున్నప్పటికి ఎక్కడా తగ్గడం లేదు.

Padi Kaushik Reddy : తగ్గని పాడి కౌశిక్ రెడ్డి..గ్రామసభలో సర్కార్ పై ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress governmen)పై నిరంతరం(Regular) ఒంటికాలిపై లేచే(Attack) బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) తనపై ప్రభుత్వం వరుస కేసులు నమోదు చేస్తున్నప్పటికి ఎక్కడా తగ్గడం లేదు. ఈ ధఫా తన నియోజకవర్గంలోని వీణవంక మండలం చల్లూరు గ్రామసభ(Challur Gram Sabha)లో మరోసారి తనదైన శైలిలో ప్రభుత్వంపై విరుచుక పడ్డారు.

రైతుభరోసా రెండు సీజన్లు ఇవ్వలేదని, ఎన్నికల్లో ఎకరాకు రూ.15వేలు ఇస్తామని ఇప్పుడు 12వేలు ఇస్తామంటున్నారని ప్రభుత్వంపై మండిపడ్డా(Fires)రు. ఇందరమ్మ ఇండ్లు ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని..హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మాత్రంకేవలం 306 ఇళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు ఎందుకని నిలదీశారు. అంటే.. ఒక్కో ఊరుకి 21 ఇళ్లే ఇస్తున్నారా? ఇదెక్కడి న్యాయం? అని ప్రశ్నించారు.

900మందికి అర్హత ఉన్నదని చెప్పిన అధికారులు మాకు పై నుంచి 306 ఇండ్లకే అనుమతిచ్చారంటున్నారని, అలాగైతే ఈ గ్రామంలో ఎంపిక చేసే 21మంది పేర్లను ఈ గ్రామసభలోనే అధికారులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఇండ్లు, రేషన్ కార్డుల మంజూరీ తెరపైకి తెచ్చారని, అర్హులను పూర్తిగా గుర్తించడం లేదని..రైతు రుణమాఫీ సగమే చేశారని విమర్శించారు. ప్రజల సమస్యలను ఎండగడుతూ, రైతులు, కూలీలు, పేదల హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజా పోరాటాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా గ్రామసభకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరైన నేపథ్యంలో అతను మళ్లీ ఎక్కడ గొడవ చేస్తాడోనని పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story