- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుర్తింపు లేని వైద్య సంఘాలు.. తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కీలక ఆరోపణ
కొన్ని గుర్తింపు లేని సంఘాలు.. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అంశాలపై తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజీజీడీఏ) ఆరోపించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కొన్ని గుర్తింపు లేని సంఘాలు.. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అంశాలపై తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజీజీడీఏ) ఆరోపించింది. వారు చేస్తున్న బాధ్యతారహిత వ్యాఖ్యలను టీజీజీడీఏ తీవ్రంగా ఖండిస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా. బి నరహరి, ప్రధాన కార్యదర్శి డా.లాలూ ప్రసాద్ రాథోడ్, కోశాధికారి డా. ఎంకే రౌఫ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అసోసియేషన్‌కు గుర్తింపు పొందడం, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో ప్రాతినిధ్యం కలగడం రెండు పూర్తిగా వేర్వేరు అంశాలని, ఇవి వేర్వేరు నియమాలు, విధానాల ప్రకారం అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ రెండు విషయాలను కావాలనే కలిపి చెప్పడం ప్రభుత్వం వైద్యులను తప్పుదారి పట్టించే ప్రయత్నమేనని విమర్శించారు.
గుర్తింపు లేని సంఘాలు చేస్తున్న ఈ రకమైన ఆధార రహిత ప్రచారం ప్రభుత్వ వ్యవస్థల పై ఎలాంటి ప్రభావం చూపబోదన్నారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు కేవలం చట్టబద్ధమైన నియమాలు, విధానాల ప్రకారమే అమలులో ఉంటాయన్నారు. ఎలాంటి ఒత్తిడి రాజకీయాలు లేదా గందరగోళం సృష్టించే ప్రయత్నాలు ఫలించబోవని తెలిపారు. ప్రభుత్వ వైద్యులు ఇలాంటి తప్పుదారి పట్టించే ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీజీజీడీఏ కోరుతోందన్నారు. గుర్తింపు పొందిన, చట్టబద్ధమైన మార్గాల ద్వారా వైద్యుల హక్కులు, ప్రయోజనాలను కాపాడేందుకు టీజీజీడీఏ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.






